Pekamedalu Movie: పేక మేడలు ఫస్ట్ రివ్యూ.. సినిమా టాక్ ఎలా ఉందంటే..?

by Prasanna |
Pekamedalu Movie: పేక మేడలు ఫస్ట్ రివ్యూ.. సినిమా టాక్ ఎలా ఉందంటే..?
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. మీరు కథతో మమల్ని మెప్పించండి మీ సినిమా హిట్ చేసే బాధ్యత మాది అని అంటున్నారు. చాలామంది కొత్త ప్రయోగాలతో రిస్క్ లు చేసి మరి సినిమాలు తీస్తున్నారు వీరిలో కొందరు మాత్రమే విజయం సాధిస్తున్నారు. తాజాగా వినోద్ కిషన్ కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టార్ హీరోల మూవీస్ లో నటించి మెప్పించాడు.

నీలగిరి మామిళ్ళ డైరెక్షన్ చేసిన ఈ మూవీ జూలై 19 న రిలీజ్ అవ్వనుంది. అయితే, సినిమా కథ పై ఉన్న నమ్మకంతో జూలై 17 ప్రీమియర్స్ షోలు వేశారు. మూవీ టికెట్ కూడా రూ. 50 ఉండటంతో సినీ ప్రియులు ‘పేక మేడలు’ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రీమియర్ షోలు చూసిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

కథ విషయానికొస్తే.. బీటెక్ చదువుకున్న వినోద్ ( హీరో ) భార్య సంపాదనతో బాగా ఎంజాయ్ చేస్తుంటాడు ఎలా అయినా డబ్బులు సంపాదించాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. మధ్యలో ఓ ఆంటీ వలలో పడతాడు ఆ విషయం భార్యకి తెలుస్తుంది. ఆ ఆమె ఏమి చేసిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు, సెకండాఫ్ కొంచం లాగ్ అయిందని అది ఒక్కటి డైరెక్టర్ చూసుకుని ఉంటే బావుండేదని మరి కొందరు అంటున్నారు. ఇంకొందరు సినిమా మెల్లి మెల్లిగా జనాలకు కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.

Next Story

Most Viewed