Tholi Prema : అదిరిపోయిన పవన్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్!

by Prasanna |   ( Updated:2023-06-27 07:28:27.0  )
Tholi Prema : అదిరిపోయిన పవన్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్!
X

దిశ, సినిమా: ప్రజంట్ టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా పవన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 30న 300 థియేటర్లలో 4కే ఫార్మాట్‍లో రీ-రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రూ.30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ఇలోపు భారీ అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రీ రిలీజైన ‘ఖుషి‘, ‘సింహాద్రి’, ‘జల్సా’ చిత్రాలు మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ‘తొలిప్రేమ’ ఏ స్థాయిలో కలెక్షన్ చేస్తుందో చూడాలి.

Read more: BRO Movie update : మామా, అల్లుడి హంగామా షురూ.. పిచ్చేక్కిస్తున్న BRO కొత్త పోస్టర్

పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!

Advertisement

Next Story

Most Viewed