'ఆర్ఆర్ఆర్' సినిమాపై.. పవన్ హీరోయిన్ ఆసక్తికర ట్వీట్

by Hamsa |   ( Updated:2022-10-06 09:25:03.0  )
ఆర్ఆర్ఆర్ సినిమాపై.. పవన్ హీరోయిన్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 24న (2022) విడుదలై బాక్సాఫీసును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయి ఆరునెలలు అయినా.. దీని గురించి టాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. కాగా, తాజాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోయిన్ నిఖిషా పటేల్ 'ఆర్ఆర్ఆర్' గురించి సంచలన ట్వీట్ చేసింది. ' నేను 'ఆర్ఆర్ఆర్' సినిమా చూశాను. నాకు ఏ మాత్రం నచ్చలేదు. అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని లేదు. ఎవరి సొంత అభిప్రాయం వాళ్లకు ఉంటుంది'. అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ నిఖిషా ను ఆడేసుకుంటున్నారు. నిఖిషా పటేల్, పవన్ కళ్యాణ్‌తో కలిసి 'కొమురం పులి' మూవీలో హీరోయిన్‌గా నటించింది.

ALSO READ : రవితేజ 'ధమాకా' నుంచి అదిరిపోయే అప్డేట్..

Advertisement

Next Story