‘BRO’ సెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన పవన్.. వీడియో వైరల్

by Anjali |   ( Updated:2023-05-21 08:07:58.0  )
‘BRO’ సెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన పవన్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. కాగా శనివారం ఈ సినిమా సెట్స్‌లోకి పవన్ కల్యాణ్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. పవన్ రాకతో సెట్స్‌లో వాతావరణం ఉత్సాహంగా మారిపోయిందని పేర్కొంది. ఈ వీడియోలో పవన్ ఓ లగ్జరీ వాహనంలో ఎంట్రి ఇవ్వగా, దర్శకుడు సముద్రఖని ఎదురెళ్లి స్వాగతం పలికాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story