పిచ్చెక్కిస్తున్న Pawan Kalyan ‘Ustad Bhagath Singh’ పోస్టర్

by GSrikanth |   ( Updated:2023-09-03 13:26:55.0  )
పిచ్చెక్కిస్తున్న Pawan Kalyan ‘Ustad Bhagath Singh’ పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇవాళ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో కత్తి పట్టుకున్న పవన్ కల్యాణ్ లుక్ అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. కాగా, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్‌పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

Next Story