పవన్ కల్యాణ్ కొడుకు అకీరాకు చిరు బర్త్ విషెస్.. క్షణాల్లో పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2024-04-09 14:38:38.0  )
పవన్ కల్యాణ్ కొడుకు అకీరాకు చిరు బర్త్ విషెస్.. క్షణాల్లో పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కుమారుడిగానే కాకుండా.. తనలోని ప్రత్యేకమైన మ్యూజిక్ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు భాషల్లోని సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఇవాళ అకీరా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫొటోలతో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. అకీరాకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ అకీరా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే’ అంటూ మెగాస్టార్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అకీరా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. మరీ పవన్ కల్యాణ్ రేంజ్‌లో అకీరా స్టార్ గుర్తింపు తెచ్చుకోనున్నాడా? అనేది చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed