పవన్ కల్యాణ్ ‘OG’ స్టోరీ ఇదే.. వైరల్ అవుతున్న న్యూస్

by sudharani |   ( Updated:2023-09-06 14:45:46.0  )
పవన్ కల్యాణ్ ‘OG’ స్టోరీ ఇదే.. వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస ప్రాజెక్టులలో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘OG’ సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ‘‘ఓజాస్ గంభీర అనే టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబేకు వచ్చి గ్యాంగ్ స్టర్‌గా మారుతాడు. ఆ ప్రయాణంలో తన ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు. ఇక ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడట. ఈ క్రమంలోనే విలన్‌ల సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడని’’ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed