- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బ్రో’ మూవీలో శాంపిల్ మాత్రమే.. వైసీపీనే ఫుల్ టార్గెట్ చేసిన ‘ఉస్తాద్’..!
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమా రిలీజ్ తర్వాత రాజకీయంగా ఎంత పెద్ద రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో డైలాగ్‌లు, సన్నివేశాలు వైసీపీ ప్రభుత్వాన్ని, నేతలను టార్గెట్ చేసి తీశారంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ‘బ్రో’ సినిమాలో చూపించింది శాంపిల్ మాత్రమే.. ‘ఉస్తాద్’లో దానికి మించి వైసీపీని టార్గెట్ చేస్తున్నారంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో పొలిటికల్ సెటైర్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ‘‘బ్రో’ సినిమాలో రెండు, మూడు పొలిటికల్ సీన్స్ మాత్రమే ఉన్నాయి.. అది శాంపిల్ మాత్రమే. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో సెటైర్స్ సునామీ ఉంటుందని హరీష్ క్లారీటి ఇచ్చారు.
అందులోను ‘ఉస్తాద్’ లో పవన్ కళ్యాణ్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇక ఓ ఎంపీని విలన్ పాత్రలో చూపించారు. ఎంపీకి ఎదురు తిరిగి హీరోయిజం చూపించే సీన్లు దండిగానే ఉంటాయి. దీంతోనే అర్థం చేసుకోవాలి ఈ మూవీలో పొలిటికల్ సెటైర్లు గట్టిగానే పడతాయని. దీంతో పవన్ అభిమానులు, ప్రజలు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరమీదకు వస్తుందా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.