అదిరిపోయిన పవన్ కల్యాణ్ న్యూ లుక్.. ఫొటోలు వైరల్

by Hamsa |   ( Updated:2023-02-22 06:05:24.0  )
అదిరిపోయిన పవన్ కల్యాణ్ న్యూ లుక్.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో యాక్టీవ్‌గా ఉంటూ వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బీజీగా ఉన్నాడు. తాజాగా, మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో నటిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో పవన్ కళ్యాణ్ లుక్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

ఆ ఫొటోల్లో పవన్ కల్యాణ్ బ్లాక్ హుడీ, ఖాకీ రంగు ప్యాంటు‌లో కనిపించాడు. తన మామతో కలిసి ఉన్న పొటోలను సాయిధరమ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ''ది బెస్ట్ డే' నేను ఎప్పటికీ మర్చిపోను. జీవితంలో నా గురువు కళ్యాణ్ మామతో కలిసి పనిచేయడం ఒక కల. నా కల నిజమైంది, ఈ అద్భుతమైన అవకాశానికి కృతజ్ఞతలు. పెద్ద మొత్తంలో నేర్చుకుంటాను. జ్ఞాపకాల కోసం వేచి ఉండలేను'' అంటూ రాసుకొచ్చాడు. దీంతో పవన్ లుక్స్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story