Tholi Prema : పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ హిట్ ‘తొలిప్రేమ’ .. 4K ట్రైలర్ రిలీజ్

by samatah |   ( Updated:2023-09-05 03:42:56.0  )
Tholi Prema : పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ హిట్ ‘తొలిప్రేమ’ .. 4K ట్రైలర్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, తారక్, ప్రభాస్ వంటి హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలు రీరిలీజై మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇక తాజాగా ఈ రీరిలీజ్ లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చేరింది. 1998 జూలై 24న విడుదలైన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. యూత్‌లో ఇప్పటికీ ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఈ మూవీని జూన్ 30న రీరిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ సినిమాకి సంబంధించిన 4K ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌లో పవన్ డ్యాన్సులు, పాటలు, డైలాగ్స్ ఆకట్టుకోగా ..జస్ట్ ట్రైలర్‌తోనే మళ్లీ ఒక్క సారిగా ఆ రోజుల్లోకి తీసుకువెళ్లారు.

Advertisement

Next Story