- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: షూటింగ్‌లో పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్!
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ షూటింగ్స్ తొందరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. ఆయన ముందుగా ఓజీ కంప్లీట్ చేయబోలున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఆ స్పెషల్ డే నాడు ఆయన నటిస్తున్న సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. పవన్ కల్యాణ్‌కు ప్రమాదం తప్పినట్లు నిర్మాత బండ్ల గణేష్ కామెంట్స్ చేయడంతో అంతా అయోమయంలో పడిపోయారు. కానీ అది ఇప్పుడు కాదు గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.
అయితే సెప్టెంబర్ 2న బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ రీరిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా.. నిర్మాత బండ్ల గణేష్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ‘‘గబ్బర్ సింగ్ షూటింగ్ గుజరాత్‌లో జరుగుతున్న టైమ్‌లో పవన్‌కళ్యాణ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. గుర్రాన్ని రైడ్ చేస్తున్న సమయంలో దాని పైనుంచి స్లిప్ అయి పడబోయాడు. కానీ, ప్రమాదం తప్పింది. అలాగే కింద పడి ఉంటే ఆయన మనకు దక్కేవారు కాదు. అది చూసిన మేము చాలా భయపడ్డాం’’ అని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత రీరిలీజ్ అవడం గురించి మాట్లాడుతూ.. అయితే గబ్బర్‌సింగ్ రిలీజ్ సమయంలో ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా అదే క్రేజ్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఏడేళ్లుగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నా. త్వరలోనే మా పరమేశ్వర ఆర్ట్స్‌లో ఓ మంచి సినిమాతో మీ ముందుకు రావాలనుకుంటున్నా. హరీష్ శంకర్, పూరి జగన్నాథ్‌లతో బ్లాక్‌బస్టర్ హిట్స్ తీస్తాను అని అన్నాడు. ప్రజెంట్ బండ్ల గణేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.