అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్..పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్!

by Jakkula Samataha |
అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్..పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అంటే పడనట్లుగా బిహేవ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి బన్నీ దూరంగా ఉండాలనుకుంటున్నాడని, మెగా కాంపౌండ్ గ్రూప్ నుంచి కూడా లెఫ్ట్ అయినట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో ఈ రెండు ఫ్యామిలీ ల మధ్య ఉన్న వివాదం ముదిరిపోయింది. ముఖ్యంగా నాగబాబు వాడు మనవాడే కానీ పరాయోడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో ట్విట్టర్‌లో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ కొనసాగింది.

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పై పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ పుష్ప సినిమాపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రలు చేస్తే, ఇప్పటి హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నాకు ఇలాంటి పాత్రలు చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అంటూ తెలిపారు. దీంతో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రపైనే పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారని అల్లు అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed