తాత అని పిలిచిన బాలుడు.. నవ్వుతూ చెంపపై ముద్దుపెట్టిన Pawan Kalyan

by Anjali |   ( Updated:2023-08-20 18:15:43.0  )
తాత అని పిలిచిన బాలుడు.. నవ్వుతూ చెంపపై ముద్దుపెట్టిన Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నప్పటికీ.. ఈయన పాలిటిక్స్ వల్ల ఈ మూవీలు కాస్త ఆలస్యమవుతున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ మానసిక దివ్యాంగ పిల్లలను కలిసేందుకు హైదరాబాద్‌లోని ఓ ఆశ్రయానికి వెళ్లారు. అక్కడున్న పిల్లల్లో ఒకరు పవర్ స్టార్‌ను తాతయ్య అని పిలిచి షాకిచ్చాడు. ఆ పిల్లాడే పవన్‌ను బాహుబలి అని.. డాడీ అని కూడా సరదాగా పిలిచాడు. ఆ బాలుడి మాటలు విన్న పవన్ ఒక నవ్వు నవ్వి నీ అల్లరి ఎక్కువైందంటూ ఆ పిల్లాడి చెంపపై ముద్దు పెట్టారు.

ఇవి కూడా చదవండి : ప్రభాస్ జాతకంలో దోషం.. పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే: వేణు స్వామి కామెంట్స్ వైరల్

Advertisement

Next Story