'నాటు నాటు' పాటకు Pawan Kalyan-Prabhas స్టెప్పులు (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-01-27 11:11:53.0  )
నాటు నాటు పాటకు Pawan Kalyan-Prabhas స్టెప్పులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకుపైగా కొల్లగొట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు మామూలు స్పందన రాలేదు. ఇప్పటికే ఈ పాట దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మారుమోగుతోంది. అయితే, తాజాగా.. ఈ పాటకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్‌ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పలు సినిమాల్లో పవన్, ప్రభాస్ చేసిన డ్యాన్సులను ఈ పాటకు అభిమానులు అద్భుతంగా సింక్ అయ్యేలా ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. లైకులు, కామెంట్లు, రీట్వీట్లతో పవర్ స్టార్, రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు.

Advertisement

Next Story