అన్నయ్య Megastar కు.. తమ్ముడు Pawan Kalyan బర్త్‌డే విషెస్

by sudharani |   ( Updated:2023-08-22 12:12:01.0  )
అన్నయ్య Megastar కు.. తమ్ముడు Pawan Kalyan బర్త్‌డే విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి రేపు 68 వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందుగానే తన అన్నయ్యకు జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ మేరకు ‘‘అన్నయ్య చిరంజీవికి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్టు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతి నిజాయితీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం’’ అంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ తన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవికి బర్త్‌డే విషెస్ తెలపడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో చిరంజీవికి పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement

Next Story