- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య షోకు పవర్ స్టార్.. ఫ్యాన్స్‌కు మతిపోయేలా మేకర్స్ బిగ్ ప్లాన్!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మెగా, నందమూరి కుటుంబాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌తో ఈ ఇద్దరు హీరోలు ఇండియన్ బాక్సాఫీస్‌కు చుక్కలు చూపించారు. తాజాగా.. మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో బుల్లితెరను షేక్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బాలయ్య హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ షో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ షోకు మూడో గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వస్తున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. షోలో భాగంగా బాలకృష్ణ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎప్పుడు అన్ స్టాపబుల్ షోకి వస్తున్నావు అని ప్రశ్నిస్తే మీరు పిలిస్తే వెంటనే వచ్చేస్తాను అంటూ త్రివిక్రమ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది, అయితే, ఎవరితో రావాలో తెలుసుగా అంటూ బాలకృష్ణ గ్యాప్ ఇవ్వడంతో త్రివిక్రమ్ రెండు నిమిషాల పాటు షాక్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో వారిద్దరిని ఎపిసోడ్‌కు సిద్ధం కమ్మని బాలకృష్ణ కోరాడని వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే నిజమైతే బుల్లితెర బద్దలవ్వడం ఖాయమని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.