PAWAN KALYAN - RENU DESAI: పవన్ కళ్యాణ్, ఆద్య క్యూట్ సెల్ఫీ.. రేణు దేశాయ్ స్వీట్ రియాక్షన్...

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-15 16:13:11.0  )
PAWAN KALYAN - RENU DESAI: పవన్ కళ్యాణ్, ఆద్య క్యూట్ సెల్ఫీ.. రేణు దేశాయ్ స్వీట్ రియాక్షన్...
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ ప్రేమ పెళ్లికి చిహ్నంగా అకీరా నందన్, ఆద్య జన్మించారు. కానీ అనుకోని పరిస్థితిలో ఈ ఇద్దరు సెలబ్రిటీలు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత పవర్ స్టార్ అన్నా లెజినోవాను మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమెతోనే ఉంటున్నాడు. కానీ అకీర, ఆద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు కొడుకుని పరిచయం చేయడం.. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం సమయంలో కూతురిని ప్రైమ్ మినిస్టర్ కు ఇంట్రడ్యూస్ చేయడం ఇందుకు ఉదాహరణ. కాగా తన వారసులుగా ఉండేందుకు పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. నాన్న అంటే ఎనలేని ప్రేమతో కనిపిస్తున్నారు. ఆయన గెలిచాక సోషల్ మీడియాతో వీరు పెట్టిన పోస్టులు ఇందుకు నిదర్శనం.

ఇక ఇదంతా ఇలా ఉంటే తాజాగా కాకినాడ జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు జనసేనాని. ఈ కార్యక్రమానికి ఆద్య కూడా హాజరుకాగా.. ఈ సందర్భంగా వీరిద్దరు తీసుకున్న క్యూట్ సెల్ఫీ వైరల్ అవుతుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఎంత బాగుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు దీనిపై రేణు దేశాయ్ రియాక్షన్ ఇస్తే మరింత క్యూట్ ఉంటుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story