పవన్, రామ్ చరణ్ ఫొటోలతో పెళ్లి శుభలేఖ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

by srinivas |
పవన్, రామ్ చరణ్ ఫొటోలతో పెళ్లి శుభలేఖ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఆయన అభిమానులు చాలా ఎక్కువ ఉన్నారు. అటు అన్న చిరంజీవి వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్‌కు కూడా ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరి అభిమానులు కూడా రామ్ చరణ్‌ను సినిమాల్లో ఆదరిస్తున్నారు. రామ్ చరణ్ సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ హడావుడి మామూలుగా ఉండదు. ఇక సినిమా హిట్ అయితే సంబురాలు వేరే లెవల్‌లో ఉంటాయి. చిరంజీవి, పవన్, చరణ్‌ను హీరోలుగానే కాకుండా సొంత వారిగా అభిమానిస్తున్నారు. కొంతమంది యువ ఫ్యాన్స్ అయితే పెళ్లి చేసుకుంటూ పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఫొటోలను పెళ్లి కార్డుపై ముద్రించి బంధువులకు పంచి అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన అభిమాని ఉమా మహేశ్వర అయ్యప్పకు అనూష దుర్గతో పెళ్లి నిశ్చయమైంది. దీంతో తన పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఫొటోలు ముద్రించారు. కార్డులో ఓవైపు జనసేన సిద్ధాంతాలను, మరో వైపు పెళ్లి ఆహ్వానాన్ని ప్రింట్ చేయించారు. ఈ పెళ్లి శుభలేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. ఈ కార్డు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్త చేస్తున్నారు.

Advertisement

Next Story