దర్శన్ బెల్ట్‌తో కొట్టడం, ఎలక్ట్రిక్ షాక్ పెట్టడం.. కళ్లారా చూసి ఎంజాయ్ చేసిన పవిత్ర

by Sujitha Rachapalli |
దర్శన్ బెల్ట్‌తో కొట్టడం, ఎలక్ట్రిక్ షాక్ పెట్టడం..  కళ్లారా చూసి ఎంజాయ్ చేసిన పవిత్ర
X

దిశ, సినిమా: కన్నడ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ ఇప్పటికే రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో అరెస్టు అయ్యారు. వీరితోపాటు 17మంది జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. సోషల్ మీడియాలో పవిత్రకు అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నాడని.. పక్కా ప్లాన్ ప్రకారం సినిమాటిక్ వేలో రూ. 50 లక్షలు ఇచ్చి మరీ మర్డర్ చేశారు. ఇందుకోసం దర్శన్ రూ. 40 లక్షలు అప్పు చేశాడని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మర్డర్ సీన్ లో కేవలం హీరో దర్శన్ మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు పవిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

రేణుకా స్వామిని ఆయన విలేజ్ చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసిన దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్.. బెంగళూరుకు 200 కిమీ దూరంలో ఓ షెడ్ లో బంధించారు. అక్కడికి చేరుకున్న దర్శన్, పవిత్ర కోపంతో ఊగిపోయారని.. దర్శన్ బెల్ట్ తో కొడుతూ, ఎలక్ట్రిక్ షాక్ పెడుతూ టార్చర్ చేశాడని పోలీసులు తెలిపారు. ఆ సీన్స్ అన్నీ చూస్తూ పవిత్ర ఫుల్ గా ఎంజాయ్ చేసిందని చెప్పారు. మొత్తానికి ఒక స్టార్ హీరో ప్రియురాలి కోసం చేసిన ఈ మర్డర్ కేసును సినిమాగా తెరకెక్కిస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed