హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో పార్టీ.. అతడితో కలిసి హాజరైన మృణాల్ డేటింగ్ నిజమేనా?

by Hamsa |   ( Updated:2023-11-14 04:18:39.0  )
హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో పార్టీ.. అతడితో కలిసి హాజరైన మృణాల్ డేటింగ్ నిజమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే హిట్ అందుకుని ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా ఇందులో సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి హృదయాలను గెలుచుకుంది. మృణాల్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఆమె హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

ఇటీవల పిప్పా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే.. దీపావళి సందర్భంగా హీరోయిన్ శిల్పాశెట్టి సెలబ్రీటీలకు పార్టీ ఇచ్చింది. అయితే శిల్పాశెట్టి పార్టీకి హాజరైన మృణాల్, బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షాతో కలిసి జంటగా కనిపించింది. అతని చేతిలో చేయి వేసి గట్టిగా పట్టుకుని పార్టీకి వెళ్లింది. దీనికి సంబంధించిని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అది చూసిన నెటిజన్లు మృణాల్ అతనితో డేటింగ్‌లో ఉందని కామెంట్లు చేస్తున్నారు. అలాగే కొందరు అతను ఇప్పటికే పెళ్లైనట్టు కనిపిస్తున్నారని అంటున్నారు.





Advertisement

Next Story