Parinithi Chopra : ‘బాహుబలి’ వల్లే మా సినిమా ఫెయిల్ అయింది.. పరిణీతి కామెంట్స్ వైరల్

by Prasanna |   ( Updated:2023-09-19 15:14:48.0  )
Parinithi Chopra : ‘బాహుబలి’ వల్లే మా సినిమా ఫెయిల్ అయింది.. పరిణీతి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: రొమాంటిక్ డ్రామా ‘మేరీ ప్యార్ బిందు’ పరాజయంపై పరిణీతీ చోప్రా తొలిసారిగా స్పందించింది. అక్షయ్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2017లో రిలీజ్ అవగా.. ఆయుష్మాన్ ఖురానా, పరిణీతి ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఫెయిల్యూర్‌కు గల కారణాలు వెల్లడించిన నటి.. ‘‘మేరీ ప్యారీ బిందు’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడానికి రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ కారణం. ఈ చిత్రం సునామీలో మా సినిమా కొట్టుకుపోయింది. ‘బాహుబలి 2’తోపాటు ఈ మూవీ కూడా విడుదలైంది. అందువల్లే ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. అయితే మళ్లీ చూస్తే మాత్రం నచ్చుతారు. ఈ సినిమాకు ఇంకా ఆ అర్హత ఉందని అనుకుంటున్నా’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ఇక దాదాపు రూ.22 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం.. కేవలం రూ.17.79 కోట్ల బిజినెస్ మాత్రమే చేసి డిజాస్టర్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి : యాక్షన్ అవతార్‌లో భయపెట్టేస్తున్న Krithi Sanon.. రెడీ టు కిల్ అంటూ..

Advertisement

Next Story