Pawan Kalyan: పవన్ కల్యాన్ రికార్డును రీచ్ అవ్వలేకపోతున్న పాన్ ఇండియా స్టార్స్!

by sudharani |
Pawan Kalyan: పవన్ కల్యాన్ రికార్డును రీచ్ అవ్వలేకపోతున్న పాన్ ఇండియా స్టార్స్!
X

దిశ, సినిమా: ప్రజెంట్ ఏ ఇండస్ట్రీలో చూసిన మాక్సిమమ్ పాన్ ఇండియా మూవీసే తెరకెక్కుతున్నాయి. అంతే కాకుండా కలెక్షన్స్‌లో కూడా సత్తా చాటుకుంటూ.. హీరోస్‌తో పాటు దర్శక నిర్మాతలకు కూడా పాన్ ఇండియా రేంజ్ క్రెడిట్‌ను ఇస్తున్నాయి. అలా మన టాలీవుడ్ హీరోస్‌లో కూడా కొంత మంది స్టార్స్ పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకుని దూసుకుపోతున్నారు. అయితే.. ఎన్ని పాన్ ఇండియా చిత్రాలు వచ్చిన, పాన్ ఇండియా స్టార్స్ వచ్చిన వపన్ కల్యాణ్ రికార్డులను మాత్రం బ్రేక్ చెయ్యలేకపోతున్నారు. అదేలా అనుకుంటున్నారా?

సరిగ్గా 24ఏళ్ల క్రితం వచ్చిన ‘ఖుషీ’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్.జే సూర్య దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లను బ్రేక్ చేసింది. అలాగే పవన్ కల్యాణ్‌ను స్టార్ హీరోను చెయ్యడమే కాకుండా.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా నిలిచింది. అయితే.. ప్రజెంట్ డేస్‌లో ఎన్ని పాన్ ఇండియా మూవీస్ వచ్చిన, ఎన్ని కోట్లు కలెక్షన్లు రాబట్టిన.. ‘ఖుషి’పై ఉన్న ఒక రికార్డు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డు ఇప్పటికీ ‘ఖుషి’ చిత్రం పేరు మీదే ఉంది. ఈ థియేటర్‌లో ఈ చిత్రం అప్పట్లోనే రూ.1.56 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. కాగా.. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ థియేటర్‌లో రూ.1.5 కోట్లు కూడా దాటలేదు. ఇక ప్రభాస్, బన్నీ, మహేష్, రామ్ చరణ్ వంటి స్టార్స్ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో పండుగా చేసుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

Advertisement

Next Story