Prabhas: రాజాసా‌బ్ మూవీకి రెమ్యునరేషన్ తగ్గించిన పాన్ ఇండియా స్టార్.. కారణం అదేనా?

by Hamsa |   ( Updated:2024-07-23 09:52:31.0  )
Prabhas: రాజాసా‌బ్ మూవీకి రెమ్యునరేషన్ తగ్గించిన పాన్ ఇండియా స్టార్.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలోని రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. వరుస సినిమాలతో బాక్సాఫీసు వద్ద సంచనం సృష్టిస్తున్నాడు. డార్లింగ్ ఇటీవల నటించిన చిత్రం ‘కల్కి 2898ఏడి’. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించి థియేటర్స్‌లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డు సాధించింది. ఇక ప్రభాస్ తదుపరి సినిమాల విషయానికొస్తే.. రాజాసాబ్‌తో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు.

ఈ క్రమంలో.. తాజాగా, డార్లింగ్ రెమ్యునరేషన్ తగ్గించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కికి 150 కోట్ల పారితోషికం అందుకున్న ఆయన రాజా సాబ్ సినిమాకు కేవలం రూ. 100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. దానికి కారణం గతంలో వచ్చిన ఆదిపురుష్ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజా సాబ్ మూవీని అదే నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండటంతో.. కాస్త అయినా నష్టాలను పూడ్చాలని ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రజెంట్ ఈ వార్త వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన డార్లింగ్ ఫ్యాన్స్ గ్రేట్ అని అంటున్నారు.

Advertisement

Next Story