గూస్ బంబ్స్ తెప్పిస్తున్న ప్రభాస్ 'Project-K' ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-06 08:10:07.0  )
గూస్ బంబ్స్ తెప్పిస్తున్న ప్రభాస్ Project-K  ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కె’. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా, అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకల్లో ప్రాజెక్ట్-కె చిత్రం ఫస్ట్ గ్లింప్స్’, టైటిల్ విడుదల చేశారు.

అందులోని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కలియుగాంతం చివర్లో ఆ సంవత్సరంలో జరిగే కథ అని తెలుస్తుంది. ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజలను కాపాడతాడని ఈ గ్లింప్స్ బట్టి అర్థమవుతుంది. దీంతో ‘అనుకున్న దానికంటే భారీగానే ప్లాన్ చేశావ్ థ్యాంక్ నాగ్ అశ్విన్ అన్న’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

Advertisement

Next Story