చిరంజీవితో పాన్ ఇండియా స్టార్ డెరెక్టర్ మూవీ..

by Anjali |   ( Updated:2023-03-24 04:25:05.0  )
చిరంజీవితో పాన్ ఇండియా స్టార్ డెరెక్టర్ మూవీ..
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్‌‌ రెడ్డి వంగా పాన్ఇండియా డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి ఇద్దరు పాన్ ఇండియా హీరోలతో సినిమాలు తీయబోతున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే రీసెంట్‌గా అల్లు అర్జున్‌తో‌ కలిసి మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఒక్కొక్కటిగా సినిమాలు పూర్తి చేస్తూ వస్తున్నాడు.

అయితే తాజాగా... ఈ దర్శకుడి కన్ను మెగాస్టార్ చిరంజీవిపైన పడింది. ఎలాగైనా చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. చిరంజీవితో సినిమా తీయడం సందీప్ రెడ్డి డ్రీమ్. స్టార్ దర్శకుడితో సినిమా అంటే చిరంజీవి కాదంటడా. కథ కొంచెం అటూ ఇటుగా ఉన్నా, అతని మీద నమ్మకంతో ఒకే చెప్పినా చెప్పవచ్చు. కాని తాను మాత్రం పక్కా ప్లానింగ్‌తో ఉన్నానని, చెప్పారు. కానీ మెగాస్టార్‌కు నచ్చేలా కథను తయారు చేస్తానని అంటున్నాడు. ఎలాగైనా సింగిల్ సిట్టింగ్‌లో సినిమాను ఓకే చేసేయాలని అనుకుంటున్నాడు. అందుకే కాస్త సమయం తీసుకుని కథ రెడీ చేస్తున్నాడట. అందుకోసం ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్ అయ్యే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్‌లో రణ్ బీర్ కపూర్‌తో ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సరైన సమయం చూసుకొని ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్ మూవీని పూర్తి చేయనున్నాడని సమాచారం.

ఇవి కూడా చదవండి: Das Ka Dhamki: దాస్ కా ధమ్కీ ఫస్ట్ డే కలెక్షన్స్

Advertisement

Next Story