నన్ను సీఎంని చేయండి వారు బాగుపడతారు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంచలన స్టేట్‌మెంట్‌

by Anjali |   ( Updated:2024-03-18 10:15:24.0  )
నన్ను సీఎంని చేయండి వారు బాగుపడతారు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంచలన స్టేట్‌మెంట్‌
X

దిశ, సినిమా: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ సంచలన కామెంట్స్ చేశాడు. బిగ్‌బాస్ విన్నర్ అయిననప్పటి నుంచి ఈయన్ను ఏదో ఒక వివాదం వెంటాడుతూ ఉంది. ప్రశాంత్ గెలుచుకున్న రూ.35 లక్షలు రైతులకు పంచుతానన్న విషయం తెలిసిందే. కాగా ఎందుకు పంచట్లేదని జనాలు పల్లవి ప్రశాంత్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు.

కాగా తాజా ఇంటర్వ్యూలో.. ‘రైతులందరినీ ఆదుకునే దమ్ము కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. నన్ను సీఎం ను చేయండి మరీ ఆదుకుంటాను అన్నాను తప్పా? 14 గ్రామాలంటే చిన్న విషయమా? నాకు వచ్చిన మనీ ఎంత? రూపాయి వస్తే రూపాయి 14 గ్రామాలకు పంచుతాను. ఒకవేళ ఇస్తే.. వీడు ఇంత ఇచ్చాడు.. అంత ఇచ్చాడు అంటారు. అలా అనకుండా ఉండాలంటే ఇక నన్ను ముఖ్యమంత్రిని చేస్తే రైతులందరినీ నేను చూసుకుంటా’ అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.

అలాగే యువత మేల్కొవాలని చెప్పాడు. యువత ధైర్యంగా బయటికొచ్చి ముందడుగేస్తే రైతులు బాగుపడతారని తెలిపాడు. రీసెంట్ గా ఓ పేద కుటుంబానికి చేసిన సాయంపై స్పందించి.. నాకు డబ్బులు ఆలస్యంగా వచ్చాయని, అందుకే లేట్ అయ్యిందన్నారు. మా గ్రామ పెద్దలు ఓ పేద కుటుంబాన్ని చూపించారు. వారికి లక్ష రూపాయలు ఇచ్చాను. ఏడాదికి సరిపడ బియ్యమిచ్చానని వెల్లడించాడు ప్రశాంత్. దీంతో నెటిజన్లు.. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సీటుకే ఎసరు పెట్టావ్ గా అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

Read More..

ఆమెను తల్లిని చేసిన హైపర్ ఆది.. సుధీర్‌తో తిరగడం వల్లే అంతకు తెగించాడా?

Advertisement

Next Story