స్టార్ హీరో కొడుకుతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన పాలక్

by sudharani |   ( Updated:2023-04-03 13:27:38.0  )
స్టార్ హీరో కొడుకుతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన పాలక్
X

దిశ, సినిమా: సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లపై పాలక్ తివారీ స్పందించింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న స్టార్ కిడ్.. తనకిప్పుడు ఎవరినీ ప్రేమించే ఆలోచన లేదని చెప్పింది. ఎందుకంటే తన కాన్సంట్రేషన్ మొత్తం చేయబోయే పనిమీదనే ఉందని, ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకునే టైమ్ లేదని తెలిపింది. ‘నేను ఈ పుకార్లను పట్టించుకోను. నా పనిపైనే దృష్టి సారిస్తాను. వృత్తిపరంగా ఇది చాలా కీలకమైన సమయం. కాబట్టి నేను నా శక్తినంత కెరీర్‌పై కేంద్రీకరిస్తున్నా. అయితే ప్రేమను ఎప్పటికీ తేదీల వలే లెక్కించలేము. అంచనా వేయలేము’ అని క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: ‘విరూపాక్ష’ చూసి మన తల్లులు గర్వంగా ఫీల్ అవుతారు.. సాయి ధరమ్

Advertisement

Next Story