మా అమ్మను చూసే నాకు ఆఫర్లు ఇచ్చారు.. అందుకే దానినుంచి తప్పుకున్న

by Hamsa |   ( Updated:2023-05-13 07:36:05.0  )
మా అమ్మను చూసే నాకు ఆఫర్లు ఇచ్చారు.. అందుకే దానినుంచి తప్పుకున్న
X

దిశ, సినిమా : ఇటీవలే సల్మాన్ ఖాన్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పలక్ తివారీ.. టెలివిజన్ షోల్లో ఆఫర్లు వచ్చినప్పటికీ చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. నిజానికి తాను టెలివిజన్‌లో అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోయానని చెబుతూ.. ‘మా అమ్మ శ్వేత తివారి చాలా సంవత్సరాలుగా టీవీలో పనిచేస్తుంది. ఆమె నాగురించిన ప్రతిదీ చాలా పరీశీలించింది. నేను సినిమాలు చేయాలనుకుంటున్నానని తనకు తెలుసు. దీంతో నేను టెలివిజన్‌లో చేసేదేమీ లేదని చెప్పింది. అయితే నేను మాత్రం సినిమాల్లోకి ప్రవేశించడం చాలా కష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే టీవీలోనే మా అమ్మ వారసత్వం ఉంది. కాబట్టి అది నాకు చాలా సులభంగా అనిపించింది. చాలా ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ మూవీస్ మీద ఆసక్తితో చేయాలనుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. చివరగా సల్మాన్ చిత్రంలో నటించిన క్యారెక్టర్ తనకు బాగా నచ్చిందని, కెరీర్‌కు మేలు చేస్తుందనే నమ్ముతున్నట్లు తెలిపింది.

Also Read: తండ్రినే టార్చర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్?

Advertisement

Next Story