పాక్ మహిళ సీమా హైదర్‌కు సినిమాలో చాన్స్

by Mahesh |   ( Updated:2024-06-02 15:00:21.0  )
పాక్ మహిళ సీమా హైదర్‌కు సినిమాలో చాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్జీలో భారత్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తిని ప్రేమించి.. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి ప్రియుడిని వివాహం చేసుకున్న పాకిస్థానీ జాతీయురాలు సీమా హైదర్‌కు సినిమాలో చాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత అమిత్ జానీ తెలిపారు. 2022లో ఉదయపూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ తల నరికి చంపిన నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'ఒక టైలర్ మర్డర్ స్టోరీ' అనే పేరు పెట్టారు. దీంతో చిత్ర నిర్మాత సచిన్ ఇంటికి వెళ్లి.. సీమా హైదర్‌ ను కలిసి సినిమాలో నటించేందుకు చాన్స్ వచ్చిందని ఆమోకు తెలిపారు. అలాగే దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.

Read More: సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు.. ఇన్‌స్టాతో క్లారిటీ ఇచ్చేశాడుగా?

Advertisement

Next Story