‘టాప్ చెఫ్’ ఫ్యాన్స్‌కు షాక్ న్యూస్.. షోనుంచి తప్పుకుంటున్న పద్మా

by sudharani |   ( Updated:2023-06-19 14:40:37.0  )
‘టాప్ చెఫ్’ ఫ్యాన్స్‌కు షాక్ న్యూస్.. షోనుంచి తప్పుకుంటున్న పద్మా
X

దిశ, సినిమా : భారతీయ అమెరికన్ మోడల్, రచయిత్రి పద్మా లక్ష్మి.. చాలా కాలంగా కొనసాగుతున్న ఫుడ్ షో ‘టాప్ చెఫ్’ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. NBC బ్రావో కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే ఈ సిరీస్‌ 20వ సీజన్ చివరిదని తెలిపింది. 2006నుంచి షోను హోస్ట్ చేస్తున్న ఆమె.. ‘నేను కష్టమైన నిర్ణయం తీసుకున్నా. దీనిపై ఆత్మపరిశీల చేసుకున్నా. హోస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఈ షోను విజయవంతంగా నిర్వర్తించినందుకు, టెలివిజన్ ఫుడ్ వరల్డ్‌ సమాజంపై ఇంతలా ప్రభావం వేసినందుకు గర్వపడుతున్నా. నేను ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నా. టేస్ట్ ది నేషన్.. నా పుస్తకాలు, సృజనాత్మక కార్యకలాపాలకు సయమం కేటాయిస్తా. ఇన్నేళ్లుగా ప్రేమతో మద్దతుగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు’ అంటూ ఎమోషనల్ అయింది.

ఇవి కూడా చదవండి:

గ్యాప్ లేకుండా పూర్తిగా విప్పేసి చూపించేస్తున్న రాశీ ఖన్నా.. దేవుడా ఏం అందాలివి?

Advertisement

Next Story