ఆస్కార్ గ్రహీత మాగీ స్మిత్ మృతి..

by sudharani |
ఆస్కార్ గ్రహీత మాగీ స్మిత్ మృతి..
X

దిశ, సినిమా: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ పథకంపై తెరకెక్కిన "హ్యారీ పోటర్" సిరీస్ ఎంతటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సిరీస్.. దాదాపు 8 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. చివరి భాగం హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాల్లౌస్ పార్ట్-2.. 2011లో విడుదలయింది. ఇందులో నటించిన నటీనటులకు ఈ సిరీస్ పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. అలా పేరు తెచ్చుకున్న వారిలో ప్రముఖ బ్రిటీష్ నటి, ఆస్కార్ గ్రహీత మాగీ స్మిత్ (89) ఒకరు. ఆమె తాజాగా కన్నుమూశారు. ‘హ్యారీ పోటర్’ చిత్రాల్లో ప్రొఫెసర్ మెక్‌గోనాగల్‌గా ఆమె మెప్పించారు. ఫేక్స్‌పియర్ నాటకంలో నటిగా ఎంతో పేరు పొందారు. 1956లో సినీ కెరీర్‌ను ఆరంభించి అనేక చిత్రాలు, TV షోలలో నటించారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేశారు. రెండుసార్లు ఆస్కార్, నాలుగుసార్లు ఎమ్మీ అవార్డులను సొంతం చేసుకున్న అతికొద్ది మంది నటీమణులలో ఈమె ఒకరు.

Advertisement

Next Story

Most Viewed