ఆస్కార్ విజయం.. ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ

by sudharani |   ( Updated:2023-03-13 12:00:06.0  )
ఆస్కార్ విజయం.. ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ
X

దిశ, వెబ్‌డెస్క్: 95 వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కించుకుని ఇండియన్ సినిమా చరిత్రలోనే చెరగని ముద్ర వేసుకుంది. కలలోనూ సాధించలేమని భావించిన అత్యంత ప్రతిష్టాత్మక ‘ఆస్కార్ అవార్డు’ ను సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న క్రమంలో ప్రపంచం మొత్తం సంబురాలు చేసుకుంటుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో కొట్టుకు చస్తున్నారు.

విషయం ఏంటంటే.. ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిలిచినప్పటి నుంచి మన హీరోల అభిమానులు మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అని వాగ్వాదాలు చేసుకున్నారు. ఇప్పుడు అవార్డు దక్కించుకున్న తర్వాత ‘‘నాటు నాటుకు ఆస్కార్ దక్కడం ఎన్టీఆర్ ఘనతే’’ అన్నట్లుగా ఎన్టీఆర్ అభిమాని ఓ పోస్ట్ రిలీజ్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ మొదలయ్యింది. పోస్ట్‌లకు ప్రతి పోస్ట్‌లు పెట్టుకుంటూ ఇరు హీరోల అభిమానులు తిట్టుకుంటున్నారు. కాగా.. కొంత మంది నెటిజన్స్ మాత్రం ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత సంబరాలు చేసుకోకుండా ఈ రచ్చ ఏంది అన్నట్లు రిప్లైలు ఇస్తున్నారు.

Read more :

నాటు నాటుకు ఆస్కార్ : తెలంగాణ యాసకు పట్టాభిషేకం

Advertisement

Next Story