ఆస్కార్ ఇవ్వాల్సింది ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు కాదు ఆయనకే ఇవ్వాలి.. RGV ట్వీట్

by Hamsa |   ( Updated:2023-06-15 10:10:32.0  )
ఆస్కార్ ఇవ్వాల్సింది ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు కాదు ఆయనకే ఇవ్వాలి.. RGV ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెరైటీ ఆలోచనలతో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ సంచలనం సృష్టిస్తాడు. తాజాగా, ఆర్జీవి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే నటీనటులకు కాదంటూ ఓ ట్వీట్ చేశారు. ‘‘ ఆస్కార్ అవార్డ్ రావాల్సింది ఆర్ఆర్ఆర్ సినిమా, రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కు కాదు. ఆ పురస్కారం కచ్చితంగా నారా లోకేష్‌కు దక్కాల్సింది’’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఇటీవల ఏపీలోని రాయలసీమ టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం అది పూర్తవడంతో నేలకు నమస్కరించి ఫొటోను నారా లోకేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఆర్జీవీ తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్ చేసి కౌంటరిచ్చారు.

Also Read: విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయలేకపోయా.. బాధపడుతున్న తమన్నా

Advertisement

Next Story