Manchu Lakshmi: మంచు ఇంట గొడవ.. లక్ష్మీ ప్రసన్న కూతూరుకి గాయాలు.. వీడియో వైరల్

by Prasanna |   ( Updated:2023-10-10 15:26:01.0  )
Manchu Lakshmi: మంచు ఇంట గొడవ.. లక్ష్మీ ప్రసన్న కూతూరుకి గాయాలు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: గత కొంత కాలంగా మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయని రకరకాల వార్తలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మంచు మనోజ్ పెళ్లికి కూడా విష్ణు చుట్టపు చూపుగానే వచ్చి వెళ్లిపోయాడు. ఇక తాజాగా అనుకోకుండా తమ్ముడు మనోజ్.. అన్నకు సంబంధించిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో మంచు కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగినట్లే అయింది. మోహన్ బాబు ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న పరువు, మర్యాదలు కొలాప్స్ అయినట్లు అనిపించింది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి కూతురుకు గాయాలైన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. లక్ష్మి తన కూతురు, విష్ణు పిల్లలతో కలిసి వస్తున్న కారు చెట్టుకు గుద్దుకుందని.. ఈ ప్రమాదం నుంచి అందరం క్షేమంగా బయటపడినా, తన పాపకు మాత్రం ముఖంపై గాయమయిందని, మూడు కుట్లు కూడా పడ్డాయని చెప్పింది.

Advertisement

Next Story