తన గర్ల్ ఫ్రెండ్ సినిమా పై.. హృతిక్ రోషన్ వైరల్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-02-05 12:11:37.0  )
తన గర్ల్ ఫ్రెండ్ సినిమా పై.. హృతిక్ రోషన్ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సబా ఆజాద్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘దిల్ కబడ్డీ’, ‘ముజ్ సే ఫ్రెండ్షిప్ కరోగే’ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా మరో ప్రాజెక్టు కోసం రెడీ అవుతోంది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే మ్యూజికల్ డ్రామా ‘సాంగ్స్ ఆఫ్ పారడైజ్’. ఇందులో సబా ఆజాద్ లీడ్ రోల్ ప్లే చేస్తుంది. అయితే తాజాగా ఆదివారం సభ ఆజాద్ తన ‘సాంగ్స్ ఆఫ్ పారడైజ్’ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

ఈ క్రమంలోనే కామెంట్ సెక్షన్ లో సభా బాయ్ ఫ్రెండ్ హృతిక్ రోషన్ కూడా స్పందిస్తూ సినిమాలో తన పర్ఫామెన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ..‘ ప్రతి నటుడు ఇందులో మీ నటనను కచ్చితంగా చూడాలి ఎందుకంటే ఇది హృదయాన్ని కదిలించే సినిమాల్లో నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమమైన వాటిలో ఇది కూడా ఒకటి’ అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. ప్రజంట్ సభా పర్ఫామెన్స్ గురించి ఆమె బాయ్ ఫ్రెండ్ హృతిక్ రోషన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.



Advertisement

Next Story