సాలిడ్ టీఆర్పీని సొంతం చేసుకున్న 'ఒకే ఒక జీవితం'

by Shiva |   ( Updated:2023-04-23 09:30:42.0  )
సాలిడ్ టీఆర్పీని సొంతం చేసుకున్న ఒకే ఒక జీవితం
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ అండ్ డైనమిక్ హీరో శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలైంది. ఇటీవల ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమినీలో ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది. తాజా అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రం తొలి టెలికాస్ట్‌లోనే 2.08 టీఆర్పీని సాధించింది. ఈ చిత్రం ప్రస్తుతం సోనీ లివ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన మూవీలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటించింది. ఈ చిత్రంలో అమల అక్కినేని కీలక పాత్ర పోషించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ప్రధాన తారగణంగా ఉన్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించగా.. జేక్స్ బిజోయ్ సంగీతాన్న సమకూర్చారు.

Also Read..

శివ కార్తికేయన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

Next Story