- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Official: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ స్టార్ హీరో పుట్టిన రోజున ఓటీటీలో కల్కి సినిమా..
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి ’2898 ఏడి‘. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలై.. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఓ మోత మోగింది. అలాగే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, విజువల్స్, మహాభారతం సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక 600 కోట్ల బడ్జేట్‌తో రూపొందించిన ఈ మూవీ ఏకంగా థియేటర్స్ లో 1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ఇదిలా ఉంటే.. రీసెంట్‌గానే కల్కి మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్ సంధ్య థియేటర్లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నది. ఈ క్రమంలో తాజాగా కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ మూవీ ఆగస్టు 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే కల్కి సినిమా రెండు ఓటీటీల్లోకి రానుంది. కల్కి హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. కాగా రెండు ఓటీటీల్లోకి ఒకే రోజు రానుండటం విశేషం. అయితే అదే రోజు చిరంజీవి పుట్టిన రోజు కావడం, చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతుండడంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.