అక్టోబర్-10: నేడు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు

by Hamsa |   ( Updated:2023-10-10 05:24:45.0  )
అక్టోబర్-10: నేడు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పుట్టిన రోజు (అక్టోబర్ 10-1973). కె. రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. 2001 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెం .1 తెలుగు చిత్రాలల్లో అతని మొదటి షాట్. ఆ తర్వాత లెక్కలేనన్ని సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్నాడు.

అంతేకాకుండా రాజమౌళి తెరకెక్కించిన ఈగ, మగధీర సినిమాల ద్వారా ఓ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్నాడు. అలాగే బాహుబలి దాదాపుగా ₹ 1,810 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. ఇక అప్పటి నుంచి రాజమౌళిని భారతీయ చలనచిత్ర రంగంలో ఉత్తమ దర్శకులలో ఒకడిగా తరచుగా పరిగణిస్తుంటారు. ఇటీవల ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అంతేకాకుండా రాజమౌళి ఎన్నో అవార్డులు రాబట్టడంతో పాటుగా వరుస చిత్రాలను రూపొందిస్తున్నాడు. దాదాపు రాజమౌళి అందరి స్టార్ హీరోలతో సినిమాలు తీశారు.

Advertisement

Next Story