Jr NTR in War 2 : విలన్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా..?

by Hamsa |   ( Updated:2023-05-19 07:04:19.0  )
Jr NTR in War 2 : విలన్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనేక చిత్రాల్లో నటించి బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్30’ మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ హీరోగానే కాకుండా ‘జై లవ కుశ’ లో జై పాత్రలో విలన్‌గా నటించి ఉగ్రరూపాన్ని చూపించారు. తాజాగా, మరోసారి విలన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అది కూడా బాలీవుడ్ సినిమాలోనట.

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్’ సీక్వెల్‌గా ‘వార్-2’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తునట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌తో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారట. అలాగే ఆయన పాత్ర నెగిటివ్‌గా ఎందుకు మారతుంది, అనే దానికి బలమైన కారణం ఉండేలాగ అయాన్ ముఖర్జీ కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది 5న ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.



Advertisement

Next Story