OSCAR List 2023: టాప్ 10లో నిలిచిన NTR!

by Hamsa |   ( Updated:2023-01-05 10:15:57.0  )
OSCAR List 2023: టాప్ 10లో నిలిచిన NTR!
X

దిశ, సినిమా: ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ ప్రధానపాత్రల్లో తెర‌కెక్కిన‌ పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్లకుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. కొమరం భీమ్ పాత్రలో నటించిన తారక్ ఇప్పుడు ఆస్కార్ 2023 అంచనాల జాబితాలో టాప్ 10వ స్థానంలో నిలిచాడు. హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ఆస్కార్స్ 2023 కోసం ఎన్‌టీఆర్‌ను ఉత్తమ నటుడి అంచనాల జాబితాలో చేర్చింది. మెహదీ బజెస్తానీ, ఆస్టిన్ బట్లర్, ఎడిన్ డాంబ్రైన్, కోలిన్ ఫారెల్, బ్రెండన్ ఫ్రేజర్, హ్యూ జాక్‌మన్, బిల్ నైఘీ, కూపర్ రైఫ్, విల్ స్మిత్ వంటి ప్రముఖ నటులు ఈ జాబితాలో ఉన్నారు. ఒక భారతీయ నటుడు టాప్ 10 ఆస్కార్ అంచనాల జాబితాలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి : అనుష్క శెట్టి చేతుల మీదుగా 'కళ్యాణం కమనీయం' ట్రైలర్ రిలీజ్

Advertisement

Next Story