Aay: మా సినిమా ట్రైలర్ ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది.. హీరో నితిన్ కామెంట్స్ వైరల్

by sudharani |
Aay: మా సినిమా ట్రైలర్ ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది.. హీరో నితిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న సినిమా ‘ఆయ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్ నుంచి రాబోతున్న ఈ సినిమాకు అంజి కె.మణిపుత్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నార్నే నితిన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాల‌ను పంచుకున్నారు.

‘గోదావ‌రి స్లాంగ్‌లో ‘ఆయ్’ అనే ప‌దాన్ని కామ‌న్‌గా వాడుతుంటాం. అలాగే సినిమాలోని ప‌లు సంద‌ర్భాల్లో ఈ ప‌దాన్ని వాడ‌టాన్ని చూడొచ్చు. కాబ‌ట్టే టైటిల్‌ను ‘ఆయ్’ అని ఫిక్స్ చేశాం. సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. మంచి ఫ‌న్ ఉన్న గోదావ‌రి బ్యాక్ డ్రాప్ మూవీ వ‌చ్చి చాలా కాల‌మైంది. క‌చ్చితంగా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం. ఎన్టీఆర్ మా సినిమా ట్రైల‌ర్ చూశారు. ఆయ‌న‌కు కామెడీ బాగా న‌చ్చింది. ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన త‌ర్వాత కూడా ఆయ‌న ద‌గ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ వ‌స్తే బావుంటుంద‌నిపిస్తుంది. కులం, మ‌తం కంటే స్నేహం చాలా గొప్పది. అంత కంటే గొప్ప విష‌య‌మేదీ ఉండ‌ద‌నే మెసేజ్‌ను ‘ఆయ్’ సినిమాలో ఇస్తున్నాం. మీరందరూ ఈ చిత్రాన్ని ఆధరిస్తారని నమ్ముతున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story