- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. నెట్టింట ఫొటోలు వైరల్
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక దీంతో పాటు బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని.. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేయగా.. రీసెంట్‌గా సెకండ్ షెబ్యూల్‌లో జాయిన్ అయ్యేందుకు ముంబై వెళ్లాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. ఎన్టీఆర్ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నిన్న రాత్రి ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాడు. ఈ పార్టికీ బాలీవుడ్ సెలబ్రిటీలు రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ లాంటి మరికొంత మంది స్టార్స్ సైతం హాజరయ్యారు.
ఇక పార్టీ అనంతరం ఎన్టీఆర్, ప్రణతితో కలిసి బయటకు వస్తున్న క్రమంలో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే.. ఓ లేడీ అభిమాని మాత్రం ఎన్టీఆర్ ముందుకు వచ్చి.. సర్ ఈ రోజు నా పుట్టిన రోజు. మీతో ఓ ఫొటో దిగొచ్చా అని అడిగింది. దీనిపై వెంటనే స్పందించిన ఎన్టీఆర్ ఆమె దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో సెల్ఫీ ఇచ్చాడు. అంతే కాకుండా బర్త్‌డే విషెస్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More...
కీలక నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. ప్లీజ్ వద్దు అంటూ తల పట్టుకుంటున్న మెగా ఫ్యాన్స్!