BIGG BOSS:బిగ్‌‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న NTR మాజీ లవర్‌.. ఆల్మోస్ట్ లిస్ట్ ఫైనల్?

by Anjali |
BIGG BOSS:బిగ్‌‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న NTR మాజీ లవర్‌.. ఆల్మోస్ట్ లిస్ట్ ఫైనల్?
X

దిశ, సినిమా: ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రసారవుతోన్న బిగ్‌బాస్ సీజన్లు మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ బిగ్ బాస్ షో లు భారతదేశంలోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా పేరు దక్కించుకున్నాయి. అయితే హిందీలో వస్తోన్న బిగ్‌బాస్ షో కు సల్మాల్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ హీరో సినిమాల పరంగా డిసప్పాయింట్ చేసినా.. బిగ్ బాస్ రియాలిటీ షో విషయంలో మాత్రం ప్రేక్షకులను జోరుగా అలరిస్తున్నారు. హిందీ బిగ్ బాస్ సీజన్ - సెప్టెంబరు 18 లేదా అక్టోబరు నెట స్టార్టింగ్ లో ప్రారంభం అవ్వనుందట.

కాగా ఈ షో కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ లీక్ అవుతున్నాయి. హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారంటూ జనాలు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రేయసి బిగ్ బాస్ హౌస్ లోకి రానుందంటూ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. మరీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. తారక్ మాజీ లవర్ సమీరా రెడ్డి అట. ఎన్టీఆర్‌తో కలిసి నరసింహుడు, అశోక్‌ వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే తారక్ తో లవ్ లో పడ్డట్లు అప్పట్లో నెటిజన్లు చర్చించుకున్నారు.

ఈమెకు వివాహమయ్యాక సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు అలరిస్తూ ఉంటుంది. మళ్లీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమీరా హిందీ బిగ్‌బాస్ షోలో అవకాశం వచ్చినట్లు సమాచారం. సమీరాతో పాటు జయన్ సైఫీ, కశిష్ కపూర్, పూజా శర్మ,రేఖా, దిగ్విజయ్ సింగ్ రాథీ, డాలీచాయ్ వాలా, ఫైసెల షేక్, దాల్జీత్, ఫుక్రా ఇన్సాన్, షీజన్ ఖాన్, దాల్జీత్ కౌర్, అలైస్ కౌశిక, దీపికా ఆర్య, నుస్రత్ జహన్, హర్హ్ జ్యోతి, కరణ్ పటేల్, సోమీ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఈ లిస్టే ఫైనల్ అంటున్నారు.

Advertisement

Next Story