NTR: ‘ఆయ్’ టీమ్‌ను అభినందించిన ఎన్టీఆర్‌.. నెట్టింట ఫొటోలు వైరల్

by sudharani |
NTR: ‘ఆయ్’ టీమ్‌ను అభినందించిన ఎన్టీఆర్‌.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆయ్’. స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఈ సినిమా రిలీజై.. పాజిటివ్ బ‌జ్‌తో పాటు ప్రేక్షకుల‌ను మనసులు దోచుకుని విమ‌ర్శకుల‌ ప్రశంసలు అందుకుంటోంది. అలాగే బాక్సాఫీస్ వద్దు కూడా మంచి వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ‘ఆయ్’ మూవీపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఆయ్ టీమ్‌కు మ‌రో అద్భుత‌మైన ప్రశంస దక్కింది.

ఈ సినిమా సక్సెస్ కావడంతో.. మూవీ టీమ్‌ను స్వయంగా కలిసి అభినందించాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే గ్లోబల్ స్టార్ గుర్తింపు ఉన్న ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నుంచి ప్రశంస‌లు ద‌క్కటం అనేది ఆయ్ చిత్ర యూనిట్‌లో స‌రికొత్త ఉత్సాహాన్నిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. కాగా.. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా వ్యవహరించిన ఈ చిత్రానికి అంజి కె. మ‌ణిపుత్ర ద‌ర్శకత్వం వహించాడు.

Advertisement

Next Story