- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Sirish: ఎన్టీఆర్ అందరితో అలాగే ప్రవర్తిస్తాడు.. మెగా హీరో ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: మెగా హీరో అల్లు శిరీష్ పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ అందుకోలేకపోయాడు. ఊర్వశివో రాక్షసివే సినిమా తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బడ్డీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని జ్ఞాన్ వేల్ రాజా, అధన నిర్మిస్తు్న్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.
తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు శిరీష్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఒక ఫొటో చూపించి అది ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారని యాంకర్ అడగ్గా.. అది ఒక పార్టీలో మేము తీసుకున్న ఫొటో. ఎన్టీఆర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, ఫ్యామిలీ అని తేడా లేకుండా అందరితో ఒకేలా ప్రవర్తిస్తాడు. ఆ విషయం నాకు ఒక పార్టీలో అర్థమైంది. ఆయనతో ఫొటో దిగడానికి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమగా హగ్ చేసుకున్నట్టుగానే అక్కడ పనిచేసే వారు కలవడానికి వచ్చినప్పుడు అలాగే చేశాడు. చాలా ఓపికగా ఫొటోలు దిగుతారు.
నేను హీరో అని నన్ను మాత్రమే ఉండడు అందరితో అలాగే ప్రేమగా ఉంటాడు. అభిమానులు ఎంతో ప్రేమ చూపించడానికి దగ్గరకు వస్తారు. ఎన్టీఆర్ కూడా అదే ఫిలీంగ్‌తో వారిని సొంత వారిలా రిసీవ్ చేసుకుంటాడు. ఈ పద్ధతి నాకు చాలా నచ్చింది. ఎన్టీఆర్ అంటే ఇష్టం పెరిగింది. ఎవరు అడిగినా ఈ కారణం చెప్పి అందుకే ఆయనంటే ఇష్టం అని చెప్తాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ అల్లు శిరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
- Tags
- NTR
- Allu Sirish