'ఎన్త్ హవర్' మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి: Kishan reddy

by sudharani |   ( Updated:2023-01-30 12:36:32.0  )
ఎన్త్ హవర్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి: Kishan reddy
X

దిశ, సినిమా : లేడి లయన్ క్రియేషన్స్ పతాకం‌పై నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఎన్త్ హవర్'. విశ్వకార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమాకు యువ వ్యాపార వేత్త రాజు గుడిగుంట్ల దర్శక, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పటికీ ఎవరూ టచ్ చేయని పూర్తి భిన్నమైన పాయింట్‌తో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణపొంది, బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Advertisement

Next Story