Rajinakanth: ఇప్పుడు నేను ఆ టెన్షన్‌లోనే ఉన్నా.. రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్‌!

by Hamsa |   ( Updated:2024-09-21 08:05:11.0  )
Rajinakanth: ఇప్పుడు నేను ఆ టెన్షన్‌లోనే ఉన్నా.. రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్‌!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ భారీ విజయాలు అందుకుంటున్నారు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వెట్టైయాన్’. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘వెట్టైయాన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను చిత్రబృందం చెన్నైలో నిర్వహించింది. ఇందులో భాగంగా.. రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఇది ప్రజలంతా సెలబ్రేట్ చేసుకునే సినిమా. అన్ని భావోద్వేగాలు ఉంటాయి.

అయితే ఏదైనా సినిమా విజయం సాధించకపోతే దాని తర్వాత చిత్రం ఎలాగైనా హిట్ కొట్టాలనే టెన్షన్ ఉంటుంది. అలాగే ఒక సూపర్ హిట్ మూవీ విడుదల అయిన తర్వాత మంచి విజయం సాధించాలని మరో రకమైన టెన్షన్. నేను ప్రజెంట్ అదే టెన్షన్‌లోనే ఉన్నాను. జైలర్ మూవీకి భారీ ప్రేక్షకాదరణ వచ్చింది. వెట్టైయాన్‌ను కూడా అలా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అనిరుధ్ సంగీతం అదుర్స్’’ అని ప్రశంసలు కురిపించారు.

Advertisement

Next Story