పవన్ భక్తులకు గమనిక.. ‘Bro’ ప్రీరిలీజ్ ఈవెంట్ షెడ్యూల్ చేంజ్..

by sudharani |   ( Updated:2023-07-26 11:27:42.0  )
పవన్ భక్తులకు గమనిక.. ‘Bro’ ప్రీరిలీజ్ ఈవెంట్ షెడ్యూల్ చేంజ్..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ జూలై 25న అంటే ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో జరగాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం రాత్రి 8.30 గంటలకు దీన్ని వాయిదా వేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ యూనిట్..

‘బ్రో భక్తులకు గమనిక సాయంత్రం 6 గంటల సమయం అన్ని ఆఫీసులు ముగించుకుని ఉద్యోగులు ఇళ్లకు వెళ్తుంటారు. దీనికితోడు భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈవెంట్‌ను రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభిస్తున్నాం. ఈ విషయాన్ని గమనించి అభిమానులు ఆ సమయానికి శిల్పకళా వేదిక దగ్గరకు రావాలని కోరుతున్నాము’ అని తెలిపారు.

Advertisement

Next Story