పెళ్లి కాకముందే తొందరపడుతున్న నార్త్ బ్యూటీ.. ఇప్పటికే ముగ్గుర్ని కనాల్సిదంటూ..

by Javid Pasha |
పెళ్లి కాకముందే తొందరపడుతున్న నార్త్ బ్యూటీ.. ఇప్పటికే ముగ్గుర్ని కనాల్సిదంటూ..
X

దిశ, సినిమా : ఏమాత్రం అవకాశం దొరికినా గ్లామర్ ట్రీట్ ఇస్తూ అభిమానులను అలరించే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో 19 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అందాల భామ. గతంలోనూ ఒకసారి ఆమె అందాల ఆరబోత ఎక్కువైందనే వివాదాన్ని ఎదుర్కొన్నది. అయినా తన ఓవర్ డోస్ బ్యూటీ ప్రదర్శనకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్న ఈ అమ్మడు పెళ్లికాకముందే వెకేషన్లు తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే తాను ముగ్గురు పిల్లల్ని కనాల్సి ఉండేనని, చాలా లేట్ అయిందని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా?.. నార్త్ బ్యూటీ ఇషా గుప్తా.

ఓవర్ డోస్ అందాలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఇషా గుప్తా సౌత్ సినిమాల్లో పెద్దగా నటించ లేదు కానీ రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో మాత్రం ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసి ఆకట్టుకుంది. కొంతకాలంగా ఈమె ప్రముఖ ఇంటర్నేషనల్ బిజినెస్‌మెన్ మనువల్ కంపోస్‌తో డేటింగ్‌లో ఉందట. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, వివాహానికి ముందే ప్రియుడితో కలిసి వెకేషన్స్‌లో తెగ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలతోపాటు తన హాట్ హాట్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన ఇషా పెళ్లికి ముందే పిల్లల్ని కనేందుకు తగిన ప్లాన్‌తో రెడీగా ఉందట. అందుకోసం ముందుగానే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నానని, తాను ఇప్పటికే పెళ్లి చేసుకొని కనీసం ముగ్గురు పిల్లల్ని కనాల్సి ఉండేనని, చాలా ఆలస్యమైందని చెప్పుకొచ్చింది. ఈ భామ మాటలు, లేటెస్ట్ గ్లామర్ ఫొటో షూట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘పెళ్లికి ముందే తొందరపడుతున్నా’వంటూ నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed