Devara Movie: దేవర పార్ట్ 2 పై నో అప్డేట్.. షాక్ లో ఫ్యాన్స్

by Prasanna |
Devara Movie: దేవర పార్ట్ 2 పై నో అప్డేట్.. షాక్ లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర మూవీ నుంచి రెండో పాట చుట్టమల్లే విడుదలయ్యాక క్రేజ్ అమాంతం పెరిగింది. అయితే, ఈ సమయంలో దేవర సినిమా ట్రెండ్‌ లో ఉంటుందనే అనుకున్నారు కానీ తారక్‌కి సంబంధించిన కొత్త మూవీ తెరపైకి రావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

నందమూరి ఫ్యాన్స్ కి కావాల్సిన రొమాంటిక్‌ సాంగ్ దొరికేయడంతో పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ పాట 27 మిలియన్స్ కి చేరుకుంది. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసిన ఈ పాట షార్ట్స్ బాగా వైరల్‌ అవుతున్నాయి. తారక్‌, జాన్వీ కెమిస్ట్రీ సూపర్ అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తారక్‌ మేకోవర్‌ కు అందరూ ఫిదా అయ్యారు.

దేవర ప్లేస్ లో తారక్‌ - ప్రశాంత్‌ నీల్‌ మూవీ ట్రెండ్ లోకి వచ్చింది. ఎందుకంటే ఈ నెల 9న ఈ సినిమాకు ముహూర్తం ఖరారు చేసారు. మరో 24 గంటల్లో ఈ మూవీకి ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే, ప్రస్తుతానికి క్యూరియాసిటీని పెంచుతుంది. ఇప్పుడు ఈ మూవీ ఎన్టీఆర్ తీస్తే దేవర పార్ట్ 2 ఉంటుందా ? లేదనే సందేహాలు వస్తున్నాయి. ఫ్యాన్స్ కి కూడా ఇది చాలా షాకింగ్ గా ఉంది.

Advertisement

Next Story